తృప్తి తీరం ..ఎంత దూరం..
హాయిగా అ ఆ లు .. పిల్ల గాలితో పాటు పాటలు తాకుతుంటే
"ఎంత అయిన స్కూల్ స్చూలె రా!ఇక్కడ ఉన్న ప్రశాంతత
ఎక్కడ ఉండదు అంటూ "అడుగులు వేస్తునాడు అనిరుధ్
"అంతే కదా మరి !ఎన్నో దేశాలు తిరిగిన నీకు అలానే ఉంది
అంటే అది స్కూల్ గొప్పతనం .. బాల్యం తియ్యదనం
"అన్నాడు "అశ్విన్
చిరునవ్వులు చిరుజల్లులో .... వాళ్ళు ఇద్దరు నడుస్తూ
తరగతి వేపు అడుగులు వేసారు
"ఒరేయ్ గణేష్ మాష్టారు రా !అన్న "అశ్విన్
పిలుపుకి అటు వేపుగా చూసాడు అనిరుధ్
"అవును రా! పద అంటూ అయన దగ్గరికి వెళ్లారు
"నమస్తే మాస్టరు !"అన్నాడు అనిరుధ్
"నమస్తే ఎవేరు బాబు మీరు అన్నారు గణేష్ మాస్టరు
"నేనండి అనిరుధ్ 2002 10th batch.. స్కూల్ topper అని
"తనని తను గుర్తుచేసాడు అనిరుధ్
"ఓ నువ్వా !ఎలా ఉన్నావు .. ఎక్కడ ఉంటున్నావు"అని
అడిగారు
"బాగున్నా మాస్టరు !నేను హైదరాబాద్‌లో ఉంటున్న .. software ఇంజనీర్ అని చెప్పాడు అనిరుధ్
"సంతోషం !"అంటూ అశ్విన్ గురించి తెలుస్కున్నారు
మాస్టరు
"అవును ఏమిటి ఇలా వచ్చారు !స్కూల్ లో ఏమి అయిన పని
ఉందా అని అడిగారు "గణేష్ మాస్టరు
"లేదు మాస్టరు !బాల్య స్నేహితులు అందరం కలుదాం అని
"ఇలాగ మీట్ అవుతున్నాము అన్నాడు
అనిరుధ్
"ఓ ఓకే!సరే అయితే నేను ఇక్కడే ఆఫీసులో ఉంటా !కలవండి
"అంటూ వెళ్ళిపోయారు మాస్టరు
"గుర్తు ఉందారా అనిరుధ్ నీకు !చిన్నపుడు గణేష్ మాస్టరు
తెలుగు పద్యం చెప్పకపోతే తాట తీసేవారు "
అన్నాడు అశ్విన్
"ఎందుకు లేదు !”
…నవ్వుతు అన్ని తరగతి గదులు
వెతుకుంటూ .. జ్ఞాపకాల్ని వెతుకుంటూ "నడుస్తున్నారు
అనిరుధ్,అశ్విన్
నెమ్మది నెమ్మదిగా అందరు స్కూల్ కి వచ్చారు
అందరు ఒకరిని ఒకరు చూసి ఆనందంగా .. ఉత్సాహంగా
పలకరించుకున్నారు
అందరు కలిసి ఆడిటోరియం లోపలకి వెళ్లారు
అందరు చిన్నపిల్లలు అయ్యిపోయి గోల గోల చేయడం మొదలు పెట్టారు
అనిరుధ్ నెమ్మదిగా స్టేజి ఎక్కి "గుడ్ మార్నింగ్
ఫ్రెండ్స్ !ఎలా ఉన్నారు అందరూ "అని అరిచాడు
ఏమి చెపుతున్నారో తెలియకుండా గోల.. తప్ప ఏమి వినపడలేదు
ఓకే ఓకే అర్ధం అయింది అందరు బాగున్నారు ..Nice to see all
of you!
"ఇలా అందరం కలవడం ఆనందంగా ఉంది ..మనం ఒకరి గురించి
తెలుసుకోవడం మంచిది కాదా
అంటూ అనిరుధ్ స్టార్ట్ చేసాడు
"నేను software ఇంజనీర్ ని ..USA లో ఉంటున్న .. Last ఇయర్ పెళ్లి అయ్యింది "అన్నాడు అనిరుధ్
"అబ్బో wow ..super రా ,,,బాగా సెటిల్ అయ్యావు .. అన్నాడు
కార్తీక్
"ఏమి హ్యాపీ రా!అందరికి దూరం గా !Dollars వస్తున్నా dullga ఉంటుంది లైఫ్ "
అన్నాడు అనిరుధ్
"ఏమి రా అన్నాడు !ప్రవీణ్ "
ఏమి ఉంది రా తెలుసుగా చినప్పుడు నుండి అన్ని
పుస్తకాలలో ఏమి రాసుకునే వాడినో
"ఎందుకు గుర్తులేదు ...
"Anirudh is my name
IAS is my aim”
"
అంటూ అరిచాడు శేఖర్
"ఏమి name, aim రా. emi లేదు .. ఏమి లేదు ..ఏదో అలాగా
సాగుతోంది అన్నాడు "అనిరుధ్
"సరేలే నా గోల ఎందుకు గాని ..నువ్వు చెప్పరా దినేష్ అన్నాడు అనిరుధ్
"నేను డాక్టర్ ని అయ్యాను రా !Dent Specialist .ee ఊరిలోనే అన్నాడు "దినేష్
"నీ tooth paste లో ఉప్పు ఉందా "అంటూ అరిచారు ఆఖరి బెంచ్‌లో ఉన్న మిత్రులు
దినేష్ నవ్వుతు "pasteలో ఉప్పు లేదు .. జీవితంలో ఇష్టం లేదు "అన్నాడు
"ఎరా !పళ్ళు ఉడిపోయే ముసలంలు బాగానే ఉన్నారుగా మన
ఊరిలో అన్నాడు "అనిరుధ్
"అల కాదు రా !మీకు తెలుసుగా నాకు poetry అంటే ఇష్టం అని .. పద్యాలూ చదివే వాడితో ఈ పళ్ళ గోల
ఏమిటిరా
అంటూ కూర్చున్నాడు దినేష్
"ఒరేయ్ రమేష్ నువ్వు చెప్పరా !అన్నాడు
"అనిరుధ్
"రమేష్ !లెక్కల రాక్షాస్ "అంటూ అరిచారు అందరు
రమేష్ లెక్కలో టాప్ అందుకే అందరు అల ఏడిపించేవాలు
"హాయ్ అల్ !బాగున్నారా .. అంటూ నెమ్మదిగా నవ్వాడు
రమేష్
"బాగునము ..కాని ఏమి చేస్తున్నావు "అని అడిగారు
అందరు
"నేను వ్యవసాయం .రా మా ఊరిలో 10 ఎకరాలు కొన్నుకుని .. "అన్నడు రమేష్
అందరు ఒక్కసారిగా అశ్చర్యపోయారు ..
ఒక్క నిముషం నిశబ్ధం
"అయ్యో అవునా !ఏమి అయింది రా .. బాగా చదివేవాడి విగా
"అన్నాడు అశ్విన్
"ఏమి ఐన Financial problems aa.. 10th తరవాత చదవలేకపోయవ
"అన్నాడు ప్రవీణ్
"ఏది ఐన లవ్ ఫెయిల్యూర్ ఆ "నవ్వుతు అడిగాడు శేఖర్
రమేష్ ఒక్కసారిగా బిగ్గరాగా నవ్వాడు
నవ్వు ఆపుకుంటూ ..సుతి మెత్తగా
"అలా ఏమి లేదు రా !పరవాలేదు బాగానే చదవను అన్నాడు
"రమేష్
"అబ్బో ఏమి చదివారు సర్ అన్నాడు "దినేష్
"M.Tech in
Aeronautical Sciences
"అన్నాడు రమేష్
ఎవెరి మొహం మీద చిరునవ్వు లేదు .. మాట మౌనం మాటున
మూగపోయింది
అందరిలో అనిరుధ్ తొందరగా తేరుకుని
"అవునా!మంచి ఎడ్యుకేషన్ కదా రా !మంచి ఉద్యోగం వచ్చేది
కదా రా అన్నాడు "
"వచ్చింది రా !ఒక two ఇయర్స్ చేశా ..కాని నాకు ఏరో స్పేస్ ఇంట్రెస్ట్
అందుకే చదివా /..కాని బాగా ఇష్టం అయిన పని వ్యవసాయం"అందుకే జాబు మానేసి ఇలాగ అన్నాడు
"అందుకే M.Tech తో పాటు అగ్రికల్చరల్ లో కూడా PG చేశా అన్నాడు రమేష్
అందరి మోహంలో ఉన్న అశ్చర్యo కాస్త అభిమానం గా మారింది
అందరు రమేష్ ని తన్మయత్వం తో చూసారు
ఏదో సూపర్ హీరో ని చూస్తునట్టు "నేను చేయాలని
పని వాడు చేసాడు అన్న"భావన అందరి కళ్ళలో
"శభాష్ !రా రమేష్ .. "అంటూ లోపలికి వచ్చారు
కృష్ణమూర్తి మాస్టారు
అందరు ఒక్కసారిగా లేచి నిలపడ్డారు
"గుడ్ మార్నింగ్ సర్!అంటూ"ఒక్కసారిగా అందరు చిన్న
పిల్లలు అయిపోయారు
కృష్ణమూర్తి మాస్టారు నవ్వుతు "కూర్చోండి
రా!అంటూ"
“రమేష్ !జీవితాన్ని సరి అయిన దృక పధంలో ..నువ్వు
చూసావు రా”
అంటూ
అందరి వేపు తిరిగి
"ఇందాక నుండి మీ అందరి మాటలు వింటున .. చాటుగా
"నవ్వుతూ
"అందరి మాటలలోచెపుకునే నీరాశ .. చెప్పలేని సంఘర్షణ .. .. ఒక్క రమేష్
మాటలో తప్ప
ఎందుకు అంటారు "అని అడిగారు కృష్ణమూర్తి
మాస్టారు
ఒక్కసారిగా అందరు 12 ఏళ్లు వెన్నకి vellipoyaru
అది క్లాసు రూమ్ !అందరు చిన్న పిల్లలాగే కనిపించారు
"ఒరేయ్ శేఖర్ నువ్వు చెప్పరా అని అడిగారు "
"శేఖర్ మొహమాటంగా లేస్తూ "డబ్బు లేకపోవటం వాళ్ళ
మాస్టారు "అన్నాడు
"అవునా !ఒరేయ్ అనిరుధ్ నువ్వు లేవేరా !నీ జీతం ఎంత రా
నెలకి అన్నాడు
"నెలకి 5 lakhs మాస్టారు అన్నాడు "
"శేఖర్ చూసావా మరి వాడు ఎందుకు లేదు హ్యాపీగా అన్నారు
మాస్టారు
"శేఖర్ కి అర్ధం కాకా కుర్చుండిపోయాడు ..
"నువ్వు చెప్పరా దినేష్ అన్నారు "
"సంతోషం గా ఉండడం సర్ అన్నాడు "దినేష్
"ఒరేయ్ నువ్వు సంతోషంగా లేవా? అన్నారు
"ఎందుకు లేను సర్ . మంచి profession మంచి family
"హ్యాపీ సర్ అన్నాడు
"మరి ఎందుకు రా ఇందాక "అంత బాధ గ చెప్పావు
అన్నారు
"అది అది అంటూ "నిశబ్ధం గా ఉండిపోయాడు
"సరే కూర్చో అని "
బోర్డు దగ్గర కి వెళ్లారు మాస్టారు
ఎపుడు నల్ల దెయ్యం లాగ చూసే ఆ బోర్డు ని ఈ రోజు ఎందుకో శ్రద్ధ గ చూసారు బోర్డు వేపు
"మీ అందరిలో ఒకటి కామన్ గా ఉంది రా
"సంపద " "సంతోషం "
కాని ఒకటి లేదు .. అది రమేష్ దగ్గరే నాకు కనిపించింది
"సంతృప్తి "
రమేష్ కి వాడి జీవితంలో "సంతృప్తి " ఉంది
అందుకే మాటలో ఆత్మవిశ్వాసం .. మోహంలో ఆశ కనిపిస్తునాయి
"మీ అందరిలో సంతోషం ఉన్న "తెలియని అత్మనున్యత
భావం . మోహంలో నిరాశ ..
ఎందుకు అంటే
"మీకు ఇష్టం లేని మార్గం లో నడుస్తున్నారు .
అందుకే దారిలో పూదారి ఉన్న మీకు ముళ్ళు లాగ కనిపిస్తునాయి
"రమేష్ తీసుకున్న మార్గం .. ముళ్ళు బాట కావచ్చు
కాని వాడికి ఇష్టం అందువాళ్ళ అవరోదాలు అని ఆవరోయణ కి మార్గాలే
"ఇష్టం అయిన పని చేస్తే సంతృప్తి .. ఆనందం " ఇంకా
మిగతావన్నీ మీకు విషయం కాదు రా
"ధనం నీకు సమాజం కోసం కావాలి
పరపతి సమాజం కోసం కావాలి
కాని సంతృప్తి నీకోసం నీకు
కావాలి”
అది లేనప్పుడు ఏమి చేసిన ఉపయోగం లేదు .. "
ఆలోచించుకోండి అంటూ వెళ్ళిపోయారు కృష్ణమూర్తి
"తరగతి అంత నిశబ్ధం ...
అందరికి మాస్టారు తననే అంటునారా అనిపించింది
"నేను కూడా అలాగే ఉన్న గా !ఏమి చేస్తునా జీవితంలో
"అంటూ ఆలోచనల అంతరంగంలో తడిసారు అందరు
ఆ నిశబ్ధం ని చీలుస్తూ "అనిరుధ్
"ఫ్రెండ్స్ ! ఆలోచించండి ఏమి చేయాలో ఆలోచించండి
సంతృప్తి అంటే సప్త సముద్రాల దాటి ఉన్న .. ఇష్టంని కష్టం అయిన
అందుకోవడమే .. "
అంటూ కృష్ణమూర్తి మాస్టారు వేపు వెళ్ళాడు అనిరుధ్
"మాస్టారు !చాలా థాంక్స్ అండి !జీవితం ఎన్ని పాఠాలు
నేర్పిన ... బడి నేర్పే పాఠాలు ఎప్పటికి వేరే
మరల ఇన్ని రోజులు అయిన ఎంత ఎదిగిన "మీరు చెప్పిన
మాటలు కి మా దగ్గర సమాధానం లేదు "
అన్నాడు అనిరుధ్
"అందరు బాగా వ్రుది లోకి వచ్చారు ..కాని ఎవేరిని
చూస్తున్న ఆ ఆనందం కనిపించటం లేదు "అందుకే ఇలాగె వచ్చి మీ కలయిక ని చెడ గొట్ట
అని నవ్వుతు అన్నారు మాస్టారు
"అయ్యో అలా ఏమి లేదు సర్ !మాస్టారు చెప్పేది ఎపుడు
మంచే .. "అంటూ
"ఏదో తెలుస్కున్న వాడిలాగా ..ఎదొ తెగించన వాడిలాగా
" గేటు వేపు అడుగులు వేసాడు
మరుసటి రోజు
ఉదయం 10:00 ఆం
“What
happened to you anirudh?why you took this sudden decision ?? అని అడిగాడు శ్రీని
“nothing
srini,just I have realized something last week?”అని అన్నాడు అనిరుధ్
"“hmm
tell me ..do you want any hike? I will ask hr for that?" అన్నాడు శ్రిని
“yes, I
need urgent hike in satisfaction level. Not in salary?” అని అనిరుధ్ అన్నాడు
“What ? I
did n’t understand “అని కోపంగా అడిగాడు శ్రిని
“you will
not understand. If you understand this, you will also resign with me “ నవ్వుతు అడుగులు వేసాడు
తెలియని దూరంలో
తృప్తి తీరం .. దాని కోసం మన అనిరుధ్ ప్రయాణం