Wednesday, August 26, 2015

"మారదు  లోకం ... మారదు కాలం " అన్న తనకి ఇష్టమయిన పాట ringtonegaa వినిపిస్తే

ఏదో లోకంలో ఉన్న అనిరుధ్ ఈ లోకంలోకి వచ్చి ఫోన్ వేపు చూసాడు

"సర్!cab వచ్చింది "అని ఫోన్ లో కాబ్ డ్రైవర్

"ఆ వస్తున్నా అంటూ నిర్లిపితంగా అడుగులు వేసాడు

"గెలుపు తలుపులే తీసే ఆకాశమే" అన్న పాట వింటూ పాత జ్ఞాపకాల పుదోటలకి వెళ్ళిపోయాడు అనిరుధ్


"ఏరా !  అనిరుధ్ ..నువ్వు చెప్పు ..పెద్ద అయిన తరవాత ఏమి అవుతావు అని అడిగారు గణేష్ మాస్టరు

"నేను ఐఏఎస్ అవుతాను అండి ..!"అని టక్కున చెప్పాడు అనిరుధ్

"గుడ్!కస్టపడి చదవాలి దానికి అర్ధం అయిందా ..సరె కూర్చో అంటూ

"ఒరేయ్ కార్తీక్ !నువ్వు చెప్పరా ..నువ్వు ఏమి అవుతావు అని అడిగారు ,మాస్టరు

"నేను ...నేను  అని నసిగాడు "కార్తీక్

"ఏమిటి రా..నసుగుతావు "కొంపతీసి మీ నాన్న లాగా కొట్టు పెట్టుకుంటావ ఏమిటి అన్నారు మాస్టరు నవ్వుతూ

"అవును మాస్టరు అని గర్వం చెప్పాడు కార్తీక్

"ఓరి నీ !సరే కూర్చో "

"సంతృప్తి అనేది సంపాదించే డబ్బులో ఉండదు ! సంతోషం ఇచ్చే పని లో ఉంటుంది " అర్ధం అయిందా అన్న గణేష్ మాస్టారు మాటలకి

అనిరుధ్ ఒక్కసారిగా ఈ లోకంలో కి వచ్చాడు

"సంతృప్తి " "సంతోషం"  "సంపాదన" ..

సంతృప్తి .. సన్నగిల్లిని సంతోషం లోగిలలో….. సంపాదన పొదలో ….ఇర్రుకు పోయి బయటికి రాలేని బతుకులు .. ఏమిటో అంటూ

తన కంపెనీ రాగానే దిగేసి పనిలో మునిగి పోయాడు


"అనిరుధ్ !What’s your plan for weekend?" అని అడిగాడు వివేక్ అగర్వాల్

నిన్నే కదరా సండే అయింది అపుడే వీకెండ్ అంట అనుకుంటూ

"Nothing Man..” అన్నాడు అనిరుధ్


"ఏమిటో ఈ లోకం !ఎదుటి వాడి Weekend Plans గురించి తప్ప .. వాడి “Weakgaa”  ఉన్న “Pains” ఉన్న అవసరం లేదు

అనిరుధ్ ఒక పెద్ద softwareకంపెనీ లో ఉద్యోగం  మంచి శాలరీ .. కాని ఏదో తెలియని అసంతృప్తి

సంతోషంగా ఉన్న ఏదో తెలియని సంఘర్షణ ……అన్ని ఉన్నఅంతు తెలియని ఆలోచనలు

నిరంతరం అనిరుధ్ చుట్టూ తిరిగే చుట్టాలు

Sunday….

"ఒరేయ్ అనిరుధ్ !ఎలా ఉన్నావు రా !అంటూ పలకిరించాడు పృథ్వి

"ఒరేయ్ పృథ్వి !ఎలా ఉన్నావు "అంటూ పలికిరించాడు

"నువ్వు ఏమిటి ఇక్కడ "అన్నాడు పృథ్వి

"ఏమి లేదు సండే కదరా .బయటికి వచ్చా అన్నాడు " అనిరుధ్

"ఓ!ok కాలం అయింది మామ .పద అల వెళ్లి కాఫీ తాగుతూ మాటలాడు కుందాం  అని దగ్గర ఉన్న cafeloki వెళ్లారు

"ఏమి చేస్తునవురా పృథ్వి !"అని అడిగాడు అనిరుధ్

"ఎందుకులే మామా !డాక్టర్ గా practice పెట్టాను రా మన ఊరిలో అన్నాడు " పృథ్వి

"ఓ!that is really great రా !కంగ్రాట్స్ I am happy for u రా అన్నాడు "అనిరుధ్

"థాంక్స్ రా !నువ్వు ఏమి చేస్తున్నావు అన్నాడు "పృథ్వి

అనిరుధ్ పని చేసే కంపెనీ details అని చెప్పాడు

"అవును పృథ్వి ..ఇంకా కవితలు కథలు రాస్తునావా అన్నాడు "అనిరుధ్

"హా .   రాస్తున్న రా !నీకు తెలుసుగా ఎంత ఇష్టమో నాకు .. ఈ doctor కూడా dad ముందు Dare చేయలేక చేసినదే

ఇప్పటికి నాకు లిటరేచర్ అన్న ... Novels అన్న పిచ్చి

కాని ఏమి చేస్తాము " తప్పదు

Compromise అని నవ్వాడు పృథ్వి

అదేలే !"అని అన్నాడు అనిరుధ్

"మనం పడే బాధ ఎదుటి కూడా పడితే ఓదార్పు ఒకింతా కష్టమే "అని అనిపించింది అనిరుధ్ కి



సరే రా అయితే !నీ నెంబర్ చెప్పు "అని నెంబర్ తీసుకుని వెళ్ళిపోయాడు పృథ్వి

అనిరుధ్ కి ఒక్కసారిగా "ఒక ప్రశ్న తలఎత్తింది

"సంతృప్తిగా ఈ సమాజంలో ఎవేరు ఉన్నారు "

డబ్బు ఉన్న వాడా ? పరపతి ఉన్న వాడా ? ఉద్యోగం ఉన్న వాడా ? "

ఎవేరు ఎవేరు ... ?

(సశేషం )

 Shiva
 Don’t Achieve Success, Achieve Excellence


1 comment:

  1. Evaru ante evaru leru Dabbu unna vaadiki inkaa kavali ani aasa leni vaadiki ento konta kaavalani aasa andaram parigetti paalu taagevallame !!!!!!!!!!!!!

    ReplyDelete